షూటింగ్ అప్ డేట్స్

Sunday,June 02,2019 - 11:20 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుండగా మరి కొన్ని సినిమాలు త్వరలోనే సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం..

అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని .. గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా షూటింగ్ జూన్ 4 నుంచి హైదరాబాద్లో జరుగనుంది. ఈ షెడ్యుల్ లో కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నారు.


నాని హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్  నిర్మిస్తున్న “గ్యాంగ్ లీడర్” సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ప్రస్తుతం నాని ,మిగతా నటీ నటులపై కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారు. అనిరుద్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజర్. ఆగస్టు 30న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

బాబీ దర్శకత్వంలో వెంకటేష్, నాగచైతన్య కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా ‘వెంకీ మామ’ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ లో జరుగుతుంది. ఈ షెడ్యుల్ లో  ఓ యాక్షన్ ఎపిసోడ్ తో పాటు సాంగ్ కూడా షూట్ చేయనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా , పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ నటిస్తున్నారు.


వరుణ్‌తేజ్‌, హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్ పై తెరకెక్కుతున్న ‘వాల్మీకి’ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్తాల్ సమీపంలో జరుగుతుంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డిస్కో రాజా’ సినిమా రెండవ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది.రామోజీ ఫిలిం సిటీలో కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు.  రవితేజ సరసన ఈ సినిమాలో నభా నటేష్ , పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ నటిస్తున్నారు. ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్ళూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.