షూటింగ్ అప్ డేట్స్

Sunday,May 19,2019 - 12:02 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుండగా మరి కొన్ని సినిమాలు త్వరలోనే సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం..

మెగా స్టార్ చిరంజీవి కధానాయకుడిగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి’సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో దండు మైలారం అనే ఊరిలో జరుగుతుంది. మరో నాలుగైదు రోజులు పాటు షూటింగ్ జరగనుంది. ఈ షెడ్యుల్ తో టోటల్ షూటింగ్ కి ప్యాకప్ చెప్పబోతున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయన తార కథానాయికగా నటిస్తుంది. అమితాబ్ బచ్చన్ , జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుదీప్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామచరణ్ నటిస్తున్నమల్టీ స్టారర్ “ఆర్ ఆర్ ఆర్” సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్ లో ప్రస్తుతం కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

వెంకటేష్, నాగచైతన్య కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా ‘వెంకీ మామ’ షూటింగ్ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో జరుగుతుంది. ఈ షెడ్యుల్ లో ఓ యాక్షన్ ఎపిసోడ్ తో పాటు సాంగ్ ని షూట్ చేయనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ & పీపుల్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు బాబి దర్శకుడు.


అక్కినేని నాగార్జున హీరోగా, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘మన్మథుడు 2’ రెండో షెడ్యూల్ పూర్తయింది. పోర్చుగల్ లో జరిగిన భారీ షెడ్యుల్ లో కొన్ని కీలకమైన సీన్స్ షూట్ చేసారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మూడో షెడ్యుల్ హైదరాబాద్ లో జరగనుంది. మనం ఎంటర్ ప్రైజెస్ & ఆనంది ఆర్ట్స్ బ్యానర్స్ పై రూపొందుతున్న ఈ సినిమాకు నాగార్జున , కిరణ్ నిర్మాతలు.


విజయ్ దేవరకొండ హీరోగా, ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా ఈ నెల 22న ఢిల్లి లో ప్రారంభం కానుంది. రెండు వారాల పాటు ఢిల్లిలో షూట్ జరగనుందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్, రవి , మోహన్ ఈ సినిమాను నిర్మించనున్నారు.