షూటింగ్ అప్ డేట్స్

Wednesday,April 24,2019 - 04:16 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుండగా మరి కొన్ని సినిమాలు త్వరలోనే సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం…


త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఈరోజే సెట్స్ పైకొచ్చింది. హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ క్వార్టర్స్ లో అల్లు అర్జున్ మిగతా నటులపై కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. హారిక-హాసినీ క్రియేషన్స్ & గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

మహర్షి సినిమాకు సంబంధించి టోటల్ షూటింగ్ ఫినిష్ చేసేసిన మహేష్, అనీల్ రావిపూడి సినిమాపై ఫోకస్ పెట్టాడు. శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ లో సెట్స్ పైకి రానుంది. ఇప్పటికే కాస్టింగ్ తో పాటు టెక్నీషియన్స్ ని కూడా ఫైనల్ చేశారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రానున్న ఈ సినిమాను దిల్ రాజు , అనిల్ సుంకర కలిసి నిర్మించనున్నారు.


రామ్-పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఇస్మార్ట్ శంకర్’ కి సంబంధించి ఇటివలే ఓ సాంగ్ షూట్ ఫినిష్ చేసారు. ప్రస్తుతం స్మాల్ బ్రేక్ తీసుకున్న యూనిట్ వచ్చే వారం నుండి మరో షెడ్యుల్ మొదలుపెట్టనుంది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయిందని టాక్. పూరి జగన్నాథ్ -చార్మి నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లు. మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.


విక్రం కుమార్ డైరెక్షన్ లో నాని నటిస్తున్న ‘గ్యాంగ్ లీడర్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. సారధి స్టూడియోస్ లో వేసిన భారీ సెట్ లో కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. నాని సరసన ప్రియాంక అరుళ్ హీరోయిన్ గా నటిస్తుంది. హీరో కార్తికేయ ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.


వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో  తెరకెక్కనున్న సినిమా మే 5 నుండి సెట్స్ పైకి రానుంది. కాకినాడ పోర్ట్ లో దాదాపు 40 రోజుల పాటు మొదటి షెడ్యుల్ జరగనుంది. ఈ షెడ్యుల్ లో వైష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి లపై కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై తెరకెక్కనున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.


బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటిస్తున్న రీమేక్ సినిమా ‘రాక్షసుడు’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో జరుగుతుంది. సాయి శ్రీనివాస్ -అనుపమ లతో పాటు మరికొందరు ఆర్టిస్టులపై సీన్స్ షూట్ చేస్తున్నారు. రమేష్ వర్మ  దర్శకత్వంలో క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నాడు.