షూటింగ్ అప్ డేట్స్

Tuesday,April 16,2019 - 03:36 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుండగా మరి కొన్ని సినిమాలు షూటింగ్ ఫినిష్ చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం…

మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహ రెడ్డి’ షూటింగ్ హైదరాబాద్ శివార్లలో వేసిన భారీ సెట్ లో  జరుగుతోంది. నయనతార, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ మూవీ ‘మహర్షి’ టాకీ పార్ట్ పూర్తిచేసుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఇటివలే ఒక సాంగ్ షూట్ ఫినిష్ చేసిన యూనిట్ ప్రస్తుతం మరో సాంగ్ ని షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్ షూట్ తో టోటల్ షూటింగ్ కి గుమ్మడి కాయ కొట్టనున్నారు. వంశీ పైడిపల్లి డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, పీవీపీ, అశ్వనీదత్ కలిసి నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అల్లరినరేష్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాడు.

బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ కి సంబంధించి ఓ సాంగ్ షూటింగ్ ఫినిష్ చేసారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన భారీ సెట్ లో ప్రభాస్ -శ్రద్దా కపూర్ లపై సాంగ్ షూట్ చేసారు. ప్రస్తుతం చిన్న బ్రేక్ తీసుకుంటున్నారు యూనిట్. యూ.వి.క్రియేషన్స్ బ్యానర్ పై స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుజీత్ దర్శకుడు.


ఇటివలే హైదరాబాద్ లో మొదటి షెడ్యుల్ పూర్తిచేసుకున్న ‘మన్మధుడు 2’ ప్రస్తుతం పోర్చుగల్ లో రెండో షెడ్యుల్ జరుపుకుంటుంది. దాదాపు నెల రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యుల్ లో కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నారు. రాహుల్ డైరెక్షన్ లో అన్నపూర్ణ స్టూడియోస్ , అనంది ఆర్ట్స్ బ్యానర్ పై ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.

నాని ‘గ్యాంగ్ లీడర్’ షూటింగ్ హైదరాబాద్ సారధి స్టూడియోస్ లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్ లో జరుగుతుంది . మరో రెండు వారల పాటు ఈ షెడ్యుల్ కొనసాగనుందని తెలుస్తుంది. ఈ షెడ్యుల్ లో నాని అలాగే మిగతా నటీ నటులపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై విక్రం కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ కంపోజర్.