షూటింగ్ అప్ డేట్స్

Thursday,February 28,2019 - 05:02 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుండగా మరి కొన్ని సినిమాలు షూటింగ్ ఫినిష్ చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం…

సూపర్‌స్టార్‌ మహేష్‌ 25వ సినిమా ‘మహర్షి’ షూటింగ్ ఫినిషింగ్ స్టేజికి చేరుకుంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో షూట్ జరుగుతుంది. మార్చి 15 వరకూ రెండు పాట‌లు మిన‌హా షూటింగ్ పూర్తి కానుంది. మ‌రో వైపు శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుతున్నాయి. ఈ సినిమాను ఏప్రిల్ 25న విడుద‌ల చేస్తారు.

ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘సాహో’ షూటింగ్ ప్రస్తుతం RFCలో జరుగుతుంది. ప్రత్యేకంగా వేసిన భారీ సెట్ లో ప్రెజెంట్ కొన్ని యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు. ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శంకర్-ఎహషాన్-లాయ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఆగస్ట్ 15న రిలీజ్ చేస్తారు.

రాజమండ్రిలో షూటింగ్ ప్రారంభమైన ‘వెంకీ మామ’ షూటింగ్ ప్రస్తుతం పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. వెంకటేష్, నాగచైతన్య అలాగే మిగతా నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలను ఓ సాంగ్ ను షూట్ చేస్తున్నారు. 20 రోజుల పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో షెడ్యుల్ జరగనుంది. వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్, నాగ చైతన్య సరసన రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

‘డియర్ కామ్రేడ్’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. విజయ్, రష్మికపై కొన్ని కీలక సీన్స్ షూట్ చేస్తున్నారు. భరత్ కమ్మ డైరెక్షన్ లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సంస్థలు కంబైన్డ్ గా నిర్మిస్తున్నాయి.

‘ఆర్‌ ఎక్స్ 100’ ఫేమ్‌ కార్తికేయ హీరోగా జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ప్రింట్‌ టెలీ ఫిలిమ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఒంగోలులో జరిగిన ఓ భారీ షెడ్యూల్‌తో 40 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. దాదాపు 25 రోజులు అక్క‌డి క్వారీలు, గ్రానైట్ ఫ్యాక్ట‌రీలు, కాల‌నీలు, రిజ‌ర్వాయ‌ర్ల‌లో కీల‌క‌మైన టాకీ పోర్ష‌న్‌, ఒక పాట‌, కొన్ని యాక్ష‌న్ ఎపిసోడ్స్ షూట్ చేశారు యూనిట్. మార్చి 5 నుంచి యూర‌ప్‌లోని క్రొయోషియాలో రెండు పాట‌ల‌ను తెర‌కెక్కించనున్నారు.

కొంత గ్యాప్ తర్వాత ప్రియమణి నటిస్తున్న  మూవీ ‘సిరివెన్నెల’. ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన షూటింగ్ తో టాకీ పార్ట్ పూర్తి చేసిన యూనిట్ ప్రస్తుతం చిక్ మంగుళూరులో సాంగ్ షూట్ చేస్తున్నారు. ఈ పాటతో సినిమా టోటల్ షూటింగ్ పూర్తవుతుంది. ANB కోర్డినేటర్స్ బ్యానర్ పై AN భాషా, రామ సీత నిర్మాతలుగా ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.