షూటింగ్ అప్ డేట్స్

Monday,October 08,2018 - 01:23 by Z_CLU

‘ఎన్టీఆర్’

నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘NTR’షూటింగ్ ప్రస్తుతం రేపల్లె లో జరుగుతుంది. ఇటివలే నిమ్మకూరులో కొన్ని సీన్స్ షూట్ చేసిన యూనిట్ ప్రెజెంట్ రేపల్లె సిటీలో బాలయ్య పై మరికొన్ని కీలక సీన్స్ షూట్ చేస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. సినిమా & పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


మహర్షి

మహేష్ – వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘మహర్షి’ ఇటివలే హైదరాబాద్ లో ఓ షెడ్యుల్ ఫినిష్ చేసుకుంది. అక్టోబర్ 18న యూ.ఎస్ షెడ్యుల్ స్టార్ట్ చేయనున్న యూనిట్ ఆ తర్వాత హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీలో మరో షెడ్యుల్ జరుపుకోనుంది. ఈ సినిమా కోసం ఆర్.ఎఫ్.సి లో భారీ సెట్ వేస్తున్నారు. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఏప్రిల్ 5 న ఈ సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.

 

ప్రభాస్ -రాధా కృష్ణ మూవీ

జిల్ ఫేం రాధా కృష్ణ డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ షూటింగ్ యూరప్ లో జరుగుతుంది. ప్రస్తుతం ప్రభాస్ , పూజా హెగ్డే పై కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారు యూనిట్. ఈ షెడ్యుల్ లో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ తో పాటు సాంగ్స్ కూడా షూట్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. కంప్లీట్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను గోపి కృష్ణ మూవీస్ , యూ.వి.క్రియేషన్స్ బ్యానర్స్ పై కృష్ణం రాజు, వంశీ , ప్రమోద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 

‘హలో గురు ప్రేమ కోసమే’

త్రినాద్ రావు డైరెక్షన్ లో రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హలో గురు ప్రేమకోసమే’ సాంగ్స్ షూట్ జరుపుకుంటుంది. ఇటివలే టాకీ పార్ట్ ఫినిష్ చేసిన యూనిట్ ప్రస్తుతం బ్యాలెన్స్ సాంగ్స్ షూట్ చేసే పనిలో బిజీ అయింది. ఈ సినిమాలో రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్, ప్రణీత హీరోయిన్స్ గా నటిస్తుండగా ప్రకాష్ రాజ్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 18 న రిలీజ్ కానుంది.

 

నాని ‘జెర్సీ’

నాచురల్ స్టార్ నాని నటించబోయే బేస్డ్ మూవీ ‘జెర్సీ’ అక్టోబర్ 18 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా విజయదశమి రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమై అదే రోజు హైదరాబాద్ లో షూట్ కూడా జరుపుకోనుంది. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించనున్న ఈ సినిమాకు గౌతం తిన్ననూరి డైరెక్టర్. అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

 

నిఖిల్ ‘ముద్ర’

నిఖిల్ ‘ముద్ర’ షూటింగ్ ప్రెజెంట్ ఓల్డ్ సిటీలో ఓ పాడుబడ్డ బంగ్లాలో జరుపుకుంటుంది. ఆల్మోస్ట్ టాకీ పార్ట్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఫైనల్ షెడ్యుల్ లో ఉంది. టి.ఎన్. సంతోష్ డైరెక్షన్ లో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటిస్తుంది. నవంబర్ 8న రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.