హీరో రాజశేఖర్ కండిషన్ క్రిటికల్ గా ఉందా?

Thursday,October 22,2020 - 12:27 by Z_CLU

“హీరో రాజశేఖర్ కండిషన్ క్రిటికల్ గా ఉందంట.
ప్రస్తుతం ఆయన శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారట.”
పొద్దున్నంచి వస్తున్న ఈ రూమర్స్ కు చెక్ పెట్టింది రాజశేఖర్ కుమార్తె, హీరోయిన్ శివాత్మిక. తండ్రి సేఫ్ గానే ఉన్నారని క్లారిటీ ఇచ్చింది.

రాజశేఖర్ తో పాటు ఆయన కుటుంబం మొత్తం కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. అందరూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకు శివాని-శివాత్మిక కోలుకున్నారు. ఆ తర్వాత జీవిత కూడా కోలుకున్నారు.

రాజశేఖర్ కు మాత్రం ట్రీట్ మెంట్ కంటిన్యూ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కండిషన్ క్రిటికల్ అంటూ రూమర్స్ రావడంతో శివాత్మిక క్లారిటీ ఇచ్చింది.