RadheShyam - శివరాత్రి శుభాకాంక్షలు

Thursday,March 11,2021 - 09:50 by Z_CLU

తెలుగు ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు అందించాడు హీరో ప్రభాస్. కేవలం విష్ చేసి ఊరుకోలేదు. తన కొత్త సినిమాకు సంబంధించి మరో బ్రాండ్ న్యూ పోస్టర్ రిలీజ్ చేశాడు.

రాధేశ్యామ్ సినిమా నుంచి శివరాత్రి శుభాకాంక్షలతో మరో పోస్టర్ వచ్చింది. దట్టంగా పరుచుకున్న మంచుపై ప్రభాస్, పూజా హెగ్డే అందంగా పడుతున్న రొమాంటిక్ స్టిల్ ను ఈ సందర్భంగా విడుదల చేశారు.

Radheshyam

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను లావిష్ గా తెరకెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా జులై 30న గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతోంది రాధేశ్యామ్.

ఈ సినిమాలో విక్రమాదిత్యగా ప్రభాస్, ప్రేరణగా పూజాహెగ్డే కనిపించబోతున్నారు. గోపీకృష్ణ మూవీస్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రాబోతోంది ఈ పాన్ ఇండియా మూవీ.