

Tuesday,January 09,2018 - 01:25 by Z_CLU
రాజశేఖర్ కూతురు శివానీ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై కొన్నాళ్లుగా గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు 2-స్టేట్స్ రీమేక్ లో నటించేందుకు శివానీ అంగీకరించింది. ఆమె డెబ్యూకు ఈ సినిమా పెర్ ఫెక్ట్ అని భావిస్తున్నాడు రాజశేఖర్.
2-స్టేట్స్ రీమేక్ లో హీరో పాత్ర కోసం చాలామందిని సంప్రదించారు. ఒకదశలో నాగచైతన్య నటిస్తాడంటూ రూమర్లు వచ్చాయి. ఫైనల్ గా అడవి శేష్, శివానీ జంటగా ఈ ప్రాజెక్టు సెట్ అయింది. వినాయక్ వద్ద అసోసియేట్ డైరక్టర్ గా పనిచేసిన వెంకట్ రెడ్డి.. ఈ రీమేక్ తో డైరక్టర్ గా పరిచయమౌతున్నాడు. ఎమ్ఎల్వి సత్యనారాయణ నిర్మించనున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి లేదా మార్చి నుంచి స్టార్ట్ చేస్తారు