డెబ్యూ సినిమాకు అంతా రెడీ !

Tuesday,May 26,2020 - 03:12 by Z_CLU

అన్ని అనుకున్నట్లు జరిగితే రాజశేఖర్ పెద్ద కూతురు శివాని రాజశేఖర్ డెబ్యూ సినిమా ఈ పాటికే థియేటర్స్ లోకి వచ్చేది. కానీ అనుకోని కారణాల వల్ల అడవి శేష్ హీరోగా శివాని హీరోయిన్ గా పరిచయం అవ్వాల్సిన ‘టూ స్టేట్స్’ రీమేక్ మూవీ.. షూటింగ్ స్టేజిలోనే ఆగిపోయింది. దీంతో అప్పటి నుండి తన డెబ్యూ సినిమా కోసం వెయిట్ చేసిన శివాని ఎట్టకేలకు సినిమా సెట్ చేసుకుంది.

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన తేజ సజ్జ హీరోగా పరిచయం అవుతున్న సినిమాతో తను కూడా హీరోయిన్ గా పరిచయం కాబోతుంది శివాని. ఈ సినిమాను మల్లిక్ రామ్ డైరెక్ట్ చేయనున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. మరి ఈ సినిమాతో శివాని హీరోయిన్ గా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.