తెలుగులో శివలింగ గ్రాండ్ ఓపెనింగ్స్

Friday,April 14,2017 - 01:30 by Z_CLU

లారెన్స్ శివలింగ తమిళంతో పాటు తెలుగులోనూ గ్రాండ్ గా రిలీజయింది. P. వాసు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అల్టిమేట్ హారర్ కంటెంట్ తో తెరకెక్కింది. రీసెంట్ గా గురు సినిమాతో టాలీవుడ్ కి దగ్గరైన రితికా సింగ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

లారెన్స్ సినిమా అందులో హారర్ ఎంటర్ టైనర్ అనగానే హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. భారీ వసూళ్లతో బిగిన్ అయిన శివలింగ ఫస్ట్ డే కలెక్షన్స్, రాఘవ కరియర్ రికార్డ్స్ బ్రేక్ చేయడం గ్యారంటీ అంటున్నాయి. ట్రేడింగ్ సోర్సెస్.

తమిళంలో ఆల్ రెడీ హిట్ టాక్ బ్యాగ్ లో వేసుకుంది శివలింగ. ఒక రోజు ముందుగానే జరిగిన ప్రీ రిలీజ్ షో, తమిళనాట ఫ్యాన్స్ లో శివలింగ ఫీవర్ ని పీక్ స్టేజ్ కి తీసుకువెళ్ళింది. ఇక రిజల్ట్స్ తేలాల్సింది తెలుగులోనే. సినీ టౌన్ లో క్రియేట్ అయిన వైబ్రేషన్స్ చూస్తుంటే బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనే సైన్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.