విజయ్ దేవరకొండతో మూడో సినిమా

Sunday,May 19,2019 - 03:20 by Z_CLU

ఇటివలే ‘డియర్ కామ్రేడ్’ షూటింగ్ ఫినిష్ చేసిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాతో పాటే ఆనంద్ అన్నామలై అనే డెబ్యూ డైరెక్టర్ తో మరో  సినిమా చేయబోతున్నాడు విజయ్. రెండు రోజుల్లో ఈ సినిమా ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమా తర్వాత శివ నిర్వాణ డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు విజయ్ దేవరకొండ.

‘మజిలీ’కి ముందే విజయ్ కి ఓ పాయింట్ వినిపించాడట శివ. స్టోరీ లైన్ నచ్చడంతో విజయ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట. లేటెస్ట్ గా మజిలీతో మరో సూపర్ హిట్ కొట్టిన శివ ప్రస్తుతం విజయ్ సినిమా కోసం కథ రెడీ చేసే పనిలో ఉన్నాడట. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి,హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తారని సమాచారం. త్వరలోనే ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.