సూపర్ హిట్ డైరెక్టర్ తో ఆ ఇద్దరు ఫిక్స్ !

Sunday,November 10,2019 - 02:05 by Z_CLU

‘నిన్ను కోరి’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శివ నిర్వాణ మొదటి సినిమాతోనే తన సత్తా ఏంటో చాటుకొని దర్శకుడిగా మంచి మార్కులే అందుకున్నాడు. ఇక లేటెస్ట్ గా ‘మజిలీ’ తో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు కూడా. అయితే ఇప్పుడీ దర్శకుడితో ఓ ఇద్దరు హీరోలు సినిమాలు ఫిక్స్ చేసుకున్నారు.

అవును శివ నిర్వాణ నెక్స్ట్ నాని , విజయ్ దేవరకొండలతో సినిమాలు చేయబోతున్నాడు. ఇప్పటికే విజయ్ శివతో సినిమాను కన్ఫర్మ్ చేసేశాడు. రేపో మాపో నాని సినిమా కూడా అనౌన్స్ మెంట్ వచ్చే చాన్స్ ఉంది. ఈ సినిమాను కూడా తన గత సినిమాలను తెరకెక్కించిన ఎమోషనల్ రొమాంటిక్ జోనర్ లోనే రూపొందిస్తాడనే టాక్ వినబడుతుంది. మరి ఈ రెండు సినిమాలతో శివ దర్శకుడిగా ఏ రేంజ్ కి వెల్తాడో చూడాలి.