పవన్ కల్యాణ్ కు కత్తి అందించిన శివబాలాజీ

Wednesday,March 01,2017 - 08:02 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శివబాలాజీ కలిసి కాటమరాయుడు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కు నలుగురు తమ్ముళ్లు. అందులో ఒక తమ్ముడిగా శివబాలాజీ కనిపించబోతున్నాడు. షూటింగ్ టైమ్ లో పవన్-శివబాలాజీ మధ్య స్నేహం మరింత పెరిగింది. అందుకే తమ స్నేహానికి గుర్తుగా పవన్ కు ఓ కత్తిని బహుకరించాడు శివబాలాజీ. ఈ కత్తిని ప్రత్యేకంగా తయారు చేయించాడు. కత్తిపై జనసేన అని చెక్కించడమే కాకుండా… మహాభారతం నుంచి ఓ సంస్కృత వాక్యాన్ని కూడా రాయించాడు. అంతేకాదు.. కత్తిపై జనసేన పార్టీ గుర్తు కూడా ఉంది. ఈ ప్రత్యేకమైన ఖడ్గాన్ని చూసి పవన్ ఎంతో ఖుషీ ఫీలయ్యాడట.

అన్నవరం సినిమా నుంచి పవన్, శివబాలాజీ మధ్య ఫ్రెండ్ షిప్ కొనసాగుతోంది. కాటమరాయుడు మూవీతో ఆ స్నేహం మరింత పెరిగింది. సెట్స్ లో ఎన్నోసార్లు పవన్ తో కలిసి శివబాలాజీ భోజనం చేశాడు. అంతేకాదు.. శివబాలాజీ పుట్టినరోజును కాటమరాయుడు సెట్స్ లో పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేశారు.