మరో ముద్దుగుమ్మకు లైఫ్ ఇస్తున్న శౌర్య

Sunday,November 22,2020 - 10:12 by Z_CLU

Shirley Setia – NagaShaurya : హ్యాండ్స‌మ్ యాక్ట‌ర్ నాగ‌శౌర్య‌ మరో బ్యూటీని పరిచయం చేయబోతున్నాడు. ఛలో సినిమాతో రష్మికను టాలీవుడ్ కు తీసుకొచ్చిన ఈ హీరో.. ఇప్పుడు తన కొత్త సినిమాతో మరో బ్యూటీని పరిచయం చేస్తున్నాడు.

టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అనీష్ కృష్ణ కాంబినేష‌న్‌లో ఐరా క్రియేష‌న్స్ ఓ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ఇటీవ‌ల లాంచ్ చేసిన విష‌యం తెలిసిందే. ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ డిసెంబ‌ర్ నుంచి జ‌ర‌గ‌నుంది.

Shirley Setia

ఆక్లాండ్‌కు చెంది, ఫోర్బ్స్ మ్యాగ‌జైన్‌లో స్థానం పొందిన సంచ‌ల‌న గాయ‌ని, న‌టి షిర్లీ సేతియా ఈ మూవీలో నాగ‌శౌర్య జోడీగా ఎంపిక‌య్యారు. నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్ ‘మ‌స్కా’తో న‌టిగా మారిన షిర్లీ, త్వ‌ర‌లో ‘నిక‌మ్మా’ చిత్రంతో బాలీవుడ్‌లోనూ ప‌రిచ‌యం అవుతున్నారు.

ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రాన్ని ఉష ముల్పూరి నిర్మిస్తున్నారు. ద‌ర్శ‌కునిగా అనీష్ కృష్ణ‌కు ఇది మూడో సినిమా.