శతమానంభవతి టీంలో జోష్ నింపిన మెగాస్టార్

Saturday,January 28,2017 - 12:43 by Z_CLU

శర్వానంద్-అనుపమ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా శతమానంభవతి. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అన్ని సెంటర్స్ నుంచి రికాార్డు వసూళ్లు వస్తున్నాయి ఈ సినిమాకు. ఈ సందర్భంగా యూనిట్ ఏర్పాటుచేసిన సక్సెస్ మీట్ కు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. నిర్మాత దిల్ రాజుతో పాటు హీరో శర్వానంద్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా దర్శకుడు వినాయక్ ను ఘనంగా సన్మానించారు. వినాయక్ తెరకెక్కించిన సినిమాతోనే దిల్ రాజు నిర్మాతగా మారాడు. అందుకే ఈ సన్మానం.

ఈ సందర్భంగా మాాట్లాడిన చిరంజీవి… “మూలలను మరిచిపోకుండా తనకు నిర్మాత గా దారి చూపించి సినిమా పట్ల నిర్మాతగా అవగాహన పెంచిన వినాయక్ ను ఇప్పటికీ గుర్తుపెట్టుకొని ఈ రోజు ఇలా సన్మానం చేయించడం చాలా గొప్ప విషయం. ఇక దిల్ రాజు అంటే నాకు చాలా గౌరవం. నిర్మాతగా మంచి టేస్ట్ ఉన్న వ్యక్తి.” అని అన్నారు.

దిల్ రాజు, హీరో శర్వానంద్ గురించి కూడా చిరంజీవి మాట్లాడారు.. ” శతమానంభవతి సినిమా విషయానికొస్తే ఒక మంచి వెజిటేరియన్ భోజనం లాంటి సినిమా అనే చెప్పాలి. తల్లిదండ్రులు తమ ఉద్యోగులతో బిజీ అయిపోయి పట్టించుకోవడం మానేసిన వారందరీకీ చక్కని మెసేజ్ ఇచ్చింది ఈ సినిమా. ఇక ఈ సినిమాలో నటించిన శర్వా గురించి చెప్పాలంటే శర్వా మా చరణ్ కి క్లోజ్ ఫ్రెండ్. చిన్నతనం నుంచి మా ఇంట్లోనే పెరిగాడు. తనని చూసినప్పుడల్లా హీరో మెటీరియల్ అనిపించేది. మొదట నటించింది నాతోనే. కూల్ డ్రింక్ యాడ్ లో ఒక కుర్రాడు కావాలంటే వెంటనే శర్వా చేస్తావా అని అడిగా. మీ కాంబినేషన్ లోనా ఖచ్చితంగా చేస్తా అని చేయడం నటించడం జరిగింది. మొదటి సినిమాకి కూడా నా బ్లెస్సింగ్స్ తీసుకొనే షూటింగ్ కి వెళ్ళాడు. ఇక ఈ రోజు యంగ్ హీరోగా గుర్తింపు అందుకోవడం మంచి విజయాలు అందుకుంటూ దూసుకెళ్లడం చాలా గర్వించ తగ్గ విషయం ఈ రోజు నా బిడ్డకి దక్కిన విజయంగా భావిస్తున్నా. ఇక రిలీజ్ కి ముందే ఈ సినిమా చక్కని విజయం అందు కోవాలని ఆశించాను. ఇక ఈ రోజు గొప్ప విజయం సాధించడం చాలా సంతోషంగా ఫీలయ్యాను. ఇక ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికీ ముఖ్యంగా ప్రకాష్ రాజ్ కి జయసుధ గారికి ప్రతీ ఒక్కరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. “అని అన్నారు.