సంక్రాంతి రోజు శతమానం భవతి

Sunday,January 01,2017 - 11:30 by Z_CLU

దిల్ రాజు నిర్మిస్తున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ శతమానం భవతి. శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. సరిగ్గా సంక్రాంతి రోజున, జనవరి 14న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకానుంది. సంక్రాంతి బరిలో నిలిచిన ఒకేఒక్క ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. ఓవైపు బాలకృష్ణ, చిరంజీవి లాంటి బడా హీరోల సినిమాలు బరిలో నిలిచినప్పటికీ… శతమానం భవతి కంటెంట్ పై ఉన్న నమ్మకంతో, దిల్ రాజు సంక్రాంతి బరిలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

ప్రకాష్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. మూవీలో తాతగా ప్రకాష్ రాజ్, మనవడిగా శర్వానంద్ నటించారు. క్లీన్  U సర్టిఫికేట్ తో సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ సినిమా.. ఈ సంక్రాంతికి కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పిస్తుందని యూనిట్ నమ్మకంగా ఉంది.