రిలీజ్ కు ముందే హిట్

Friday,January 13,2017 - 09:03 by Z_CLU

మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ ఆఫ్ ది సీజన్ శతమానంభవతి ఒక రోజు ముందే ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అయిపోయింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు. ఓవర్సీస్ లో ఈ సినిమా ఒక రోజు ముందే విడుదలైంది. కొన్ని గంటల కిందటే ఈ సినిమాకు సంబంధించి ప్రత్యేక ప్రదర్శనలు ఓవర్సీస్ లో ప్రారంభమైపోయాయి. దంగల్ సినిమా తరహాలో… తెలుగులో కంటే ముందే ఓవర్సీస్ లో ఈ సినిమాను విడుదల చేశాడు నిర్మాత దిల్ రాజు. ఈ స్టార్ ప్రొడ్యూసర్ ప్లాన్ పర్ ఫెక్ట్ గా వర్కవుట్ అయింది. ఓవర్సీస్ నుంచి శతమానం భవతి సినిమాకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.

ఓవైపు చిరంజీవి 150వ సినిమా, మరోవైపు బాలకృష్ణ వందో సినిమా థియేటర్లలో కొనసాగుతున్నప్పటికీ… శర్వానంద్ నటించిన శతమానం భవతి సినిమాకు ఓవర్సీస్ లో భారీస్థాయిలో థియేటర్లు దక్కాయి. పైగా ఆ రెండు సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా హిట్ టాక్ కూడా తెచ్చుకుంది. ఈ సంక్రాంతికి ఇదే సిసలైన సినిమాా అంటూ ఓవర్సీస్ లోని తెలుగు ఆడియన్స్ శతమానంభవతి సినిమాను ప్రత్యేకంగా మెచ్చుకుంటున్నారు.

shatamanam-bhavati-zee-cinemalu-1

శర్వానంద్-అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన శతమానం భవతి సినిమాకు సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించాడు. పచ్చటి పల్లెటూరు నేపథ్యంలో కుటుంబ సంబంధాలు, బాంధవ్యాల్ని మనసుకు హత్తుకునేలా చూపించింది శతమానం భవతి సినిమా. మిక్కీ జే మేయర్ సంగీతం సినిమాకు మరో ఎట్రాక్షన్.