సక్సెస్ ఫుల్ గా 100 రోజులు

Sunday,April 23,2017 - 01:03 by Z_CLU

సంక్రాంతి కానుకగా విడుదలైన శతమానంభవతి సినిమా సక్సెస్ ఫుల్ గా వంద రోజులు పూర్తిచేసుకుంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించారు. శర్వానంద్-అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా పేరుతెచ్చుకుంది. అంతేకాదు.. ఏకంగా జాతీయ అవార్డు కూడా అందుకొని టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయింది శతమానంభవతి సినిమా.

శర్వానంద్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది శతమానంభవతి. అటు అనుపమకు కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ బెర్త్ ఫిక్స్ చేసింది ఈ మూవీ. ప్రకాష్ రాజ్-జయసుధ కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా గట్టిపోటీ మధ్య సంక్రాంతి సీజన్ లో విడుదలైంది. ఓ వైపు చిరంజీవి రీఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150, మరోవైపు బాలకృష్ణ ప్రతిష్టాత్మక వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలు థియేటర్లలో ఉన్నప్పటికీ… చిన్న సినిమాగా వచ్చిన శతమానం భవతి అందరి మన్ననలు అందుకుంది.

ఈ సినిమాతో శర్వానంద్, వరుసగా రెండోసారి సంక్రాంతి హీరో అనిపించుకున్నాడు. అటు ఓవర్సీస్ లో కూడా శర్వానంద్ మార్కెట్ ను డబుల్ చేసింది శతమానంభవతి సినిమా.