3 మిలియన్ వ్యూస్ దాటిన శతమానం భవతి జ్యూక్ బాక్స్

Tuesday,February 07,2017 - 03:16 by Z_CLU

సంక్రాంతికి రిలీజ్ అయి రీసెంట్ గా ప్రెస్టీజియస్ ఆస్కార్ లైబ్రరీకి సెలెక్ట్ అయిన శతమానం భవతి సందడి ఇప్పట్లో తగ్గే సూచనలైతే కనిపించడం లేదు. అల్టిమేట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో క్రియేట్ చేస్తున్న ఇంపాక్ట్ ఒక ఎత్తైతే, యూ ట్యూబ్ లో ఇంకా ఏ మాత్రం డిమాండ్ తగ్గని సాంగ్స్ ఇంపాక్ట్ ఇంకో ఎత్తు.

కళ్ళు మూసుకుని వింటున్నా, విజువల్స్ ని కళ్ళ ముందు నిలిపే సాంగ్స్, జస్ట్ ఫ్యామిలీ లిజెనర్స్ నే కాదు యూత్ ని కూడా మెస్మరైజ్ చేస్తున్నాయి. ఇప్పటికే శతమానం భవతి జ్యూక్ బాక్స్ ఏకంగా 3 మిలియన్ వ్యూస్ ని దాటేసింది. ఈ సినిమాకి మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

శర్వానంద్, అనుపమ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ తో పాటు ప్రకాష్ రాజ్, జయసుధ అవుట్ స్టాండింగ్ పర్ఫామెన్స్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ రీజన్స్ ఏవైతేనేం శతమానం భవతి అటు థియేటర్స్ లోను, రిపీటెడ్ ఆడియెన్స్ ని కూడా తన అకౌంట్ లో వేసుకుంటూ, ఇప్పటికీ అదే స్ట్రెంత్ తో బాక్సాఫీస్ ని నింపేసుకుంటుంది.