సంక్రాంతి సినిమా రెడీ...

Wednesday,December 28,2016 - 05:30 by Z_CLU

ఈ సంక్రాంతి కి మెగా స్టార్ నటించిన ‘ఖైదీ నంబర్ 150 ‘, నట సింహం బాలకృష్ణ నటించిన ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమాలు పోటీ పడనుండగా ఈ రెండు సినిమాలతో పాటు సంక్రాంతి పండుగకు పర్ఫెక్ట్ సినిమా గా ‘శతమానం భవతి’ కూడా థియేటర్స్ కు రానున్న సంగతి తెలిసిందే.

 

  శర్వా నంద్-అనుపమ పరమేశ్వరన్ జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వం లో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా లేటెస్ట్ గా సెన్సార్ పూర్తి చేసుకొని క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ తో సంక్రాంతి కి రానున్నరెండు సినిమాలకంటే ముందే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ అయిపోయింది.