శతమానం భవతి రిలీజై సరిగ్గా సంవత్సరం

Sunday,January 14,2018 - 09:05 by Z_CLU

శతమానం భవతి రిలీజై ఇవాళ్టికి సరిగ్గా 1 ఇయర్ కంప్లీట్ అయింది. సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గతేడాది సంక్రాంతి బరిలో సక్సెస్ ఫుల్ సినిమా అనిపించుకుంది. అచ్చమైన పల్లెటూరు, న్యాచురల్ గా ఉండే సిచ్యువేషన్స్ శతమానం భవతి సినిమా జస్ట్ సూపర్ హిట్ ఎంటర్ టైనర్ అనిపించుకోవడమే  కాదు గతేడాది బెస్ట్ పాప్యులర్ మూవీగా 64 వ జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకుంది. అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత గౌరవప్రదమైన ఆస్కార్ అకాడమీ ఈ సినిమా పబ్లిసిటీ మెటీరియల్ కి, ఆస్కార్ లైబ్రరీ లో చోటిచ్చింది.

రెగ్యులర్ కాన్సెప్ట్ సినిమాల మూసలో కాకుండా ఇమోషనల్ ఎలిమెంట్స్ తో అటు యూత్ ని ఇటు ఫ్యామిలీస్ ని ఎట్రాక్ట్ చేసిన శతమానం భవతి ఫ్యూచర్ సినిమాలకు కూడా ఇన్స్పిరేషన్ లా నిలిచింది. శర్వానంద్ కరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా, అనుపమ పరమేశ్వరన్ ని కూడా కమర్షియల్ హీరోయిన్ గా ఎలివేట్ చేసింది.

 

 

సినిమాలోని ప్రతి సన్నివేశంలో తెలుగుదనం, అవసరమైన చోటల్లా కావలసినంత కామెడీ పండించిన క్రెడిట్ వేగేశ్నసతీష్ కి దక్కితే, ఆ సీన్స్ ని మరింత ఎలివేట్ చేసింది మిక్కీ జె. మేయర్ మ్యూజిక్. ఫ్యామిలీ ఇమోషన్స్ కి బ్రాండ్ అంబాసిడర్ అనిపించుకున్న దిల్ రాజు, ఈ సినిమాతో తన బ్రాండ్ వ్యాల్యూ మరింత పెంచుకున్నాడు.