‘శతమానం భవతి’ కి సూపర్ హిట్ ట్యాగ్

Monday,January 09,2017 - 03:45 by Z_CLU

సరిగ్గా సంక్రాంతి రోజు ఫెస్టివల్ మూడ్ కి మరికొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేయడానికా అన్నట్లు రిలీజ్ అవుతోంది శతమానం భవతి. పచ్చటి పల్లెటూరిలో…. పండగలాంటి ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన శతమానం భవతి… రీసెంట్ గా రిలీజైన ట్రేలర్ తో  ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయడంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది.

టాలీవుడ్ లో ఎంతమంది కమర్షియల్ హీరోలున్నా, శర్వానంద్ కి ఉన్న బ్రాండ్ వేరు. ఫీల్ గుడ్  సినిమా అయితేనే కానీ సంతకం చేయని శర్వానంద్… ఈసారి మ్యాగ్జిమం జనరేషన్స్ ని టార్గెట్ చేయబోతున్నాడు. దానికి తోడు ప్రేమమ్ సినిమాతో తెలుగు సినిమాకు ఇంట్రడ్యూస్ అయిన అనుపమ టాలీవుడ్ లో పర్మనెంట్ ప్లేస్ ని రిజిస్టర్ చేసుకోనుంది.

ప్రకాష్ రాజ్, జయసుధ సీనియర్ క్యారెక్టర్స్ తో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన ‘శతమానం భవతి’ దిల్ రాజు ప్రొడక్షన్ అకౌంట్ లో మరో మంచి సినిమాగా నిలవడం ఖాయమంటున్నాయి ట్రేడింగ్ సోర్సెస్. ఇప్పటికే ఆకట్టుకుంటున్న ‘శతమానం భవతి’ ఆడియో… సినిమాకి పెద్ద ఎస్సెట్ అయింది.