మే 12న రాధ రిలీజ్

Monday,May 01,2017 - 11:03 by Z_CLU

వరుస విజయాలతో దూసుకుపోతున్న శర్వానంద్ ఇప్పుడు రాధ పేరుతో మరో మూవీ రిలీజ్ చేశాడు. తన కెరీర్ లో ఫస్ట్ టైం పోలీస్ పాత్రలో శర్వానంద్ చేసిన సినిమా ఇది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తాజాగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. మే 12న రాధ సినిమా థియేటర్లలోకి రానుంది.

రాధ సినిమాతో చంద్రమోహన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. భోగవల్లి బాపినీడు నిర్మాత. రాధ సినిమా ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కు, టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి భారీ స్పంద‌న వ‌చ్చింది. ఇక సినిమాకు సంబంధించి ఇప్పటికే 2 పాటల్ని ఆన్ లైన్ లో విడుదల చేశారు. ఇప్పుడు మిలాన్ ఓ పాట చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. ఈ పాట పూర్త‌యితే నిర్మాణాంత‌ర కార్యక్ర‌మాలు స‌హా సినిమా మొత్తం పూర్త‌వుతుంది.

ర‌ధ‌న్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియోను త్వరలోనే విడుదల చేయబోతున్నారు.  అవుటండ్ అవుట్ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రొమాన్స్, కామెడీ , యాక్షన్  అన్నీ సమపాళ్ళలో ఉంటాయట.