Sharwanand Oke Oka Jeevitham - శర్వా నుంచి మరో మూవీ రెడీ

Sunday,November 07,2021 - 02:11 by Z_CLU

Sharwanand’s Oke Oka Jeevitham To Release In February 2022

యంగ్ హీరో శర్వానంద్ కెరీర్‌ లో 30వ సినిమాగా రూపొందుతోన్న  మైల్ స్టోన్ మూవీ ఒకే ఒక జీవితం. ఈ చిత్రంతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఫ్యామిలీ డ్రామా, సైఫై సినిమాకు తరుణ్ భాస్కర్‌ మాటలను అందించారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. ఇక ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో అక్కినేని అమల గోడపై  కూర్చుని ఉన్నారు. శర్వానంద్, అతని తమ్ముడు అమ్మ ఒడిలో తల పెట్టుకుని అలా సేద తీరుతున్నారు. ఈ పోస్టర్‌తో పాజిటివ్ వైబ్స్ ఏర్పడుతున్నాయి.

తెలుగమ్మాయి రీతూ వర్మ ఈ చిత్రంలో శర్వానంద్ పక్కన హీరోయిన్‌గా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. డియర్ కామ్రేడ్ సినిమాకు పని చేసిన సినిమాటోగ్రఫర్ అండ్ ఎడిటర్ సుజీత్ సారంగ్, శ్రీజిత్ సారంగ్‌లు ఈ చిత్రంలో భాగం అయ్యారు.

శర్వానంద్‌కు  క్రేజ్ కి తగ్గట్టుగా  ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్, యూత్‌ను ఆకట్టుకునేలా ఉండబోతోంది. తల్లీ కొడుకుల బంధం అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.

ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌కు విశేషమైన స్పందన వచ్చింది.

నటీనటులు : శర్వానంద్, రీతూ వర్మ, అమల అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు

సాంకేతిక బృందం

రచయిత, దర్శకుడు :  శ్రీ కార్తీక్
నిర్మాతలు :  ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు
ప్రొడక్షన్ కంపెనీ  : డ్రీమ్ వారియర్ పిక్చర్స్
డైలాగ్స్ :  తరుణ్ భాస్కర్
డీఓపీ  : సుజిత్ సారంగ్
ఎడిటర్ :  శ్రీజిత్ సారంగ్
సంగీతం :  జేక్స్ బిజోయ్
ఆర్ట్ డైరెక్టర్  : ఎన్ సతీష్ కుమార్
స్టంట్స్  : సుదేష్ కుమార్
స్టైలిష్ట్  : పల్లవి సింగ్
లిరిక్స్ : సిరివెన్నెల సీతారామశాస్త్రి, కృష్ణకాంత్

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics