మహానుభావుడు ముస్తాబయ్యాడు

Thursday,August 24,2017 - 09:47 by Z_CLU

హీరో శర్వానంద్, దర్శకుడు మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా మహానుభావుడు. వినాయక చవితి సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ఈరోజు విడుదలైంది. మారుతి స్టయిల్ లో యూత్ ఫుల్ గా ఉంది ఫస్ట్ లుక్. కేవలం ఫస్ట్ లుక్ తో సరిపెట్టకుండా షార్ట్ టీజర్ కూడా రిలీజ్ చేశారు.

గతంలో భలేభలే మగాడివోయ్ సినిమా కోసం డిఫరెంట్ కాన్సెప్ట్ సెలక్ట్ చేసుకున్న మారుతి.. మహానుభావుడు కోసం అలాంటిదే మరో కొత్త కాన్సెప్ట్ కనిబెట్టాడు. ఇందులో హీరోకు ఓసీడీ అనే వ్యాధి ఉంటుంది. అంటే చేసిందే మళ్లీ చేస్తుంటాడు. దీనికితోడు అతి జాగ్రత్త, అతి శుభ్రత. ఈ వీక్ నెస్ తో కామెడీ పండించడానికి ప్రిపేర్ అవుతున్నారు శర్వ-మారుతి.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్ సరసన మెహరీన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒక్క సాంగ్ మినహా కంప్లీట్ అయింది. ఈనెలాఖరుకు అది కూడా పూర్తిచేయబోతున్నారు. దసరా కానుకగా వచ్చేనెల 29న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.