Sharwanand ఆ సినిమా పూర్తి చేశాడు

Tuesday,November 24,2020 - 12:21 by Z_CLU

ప్రస్తుతం హీరోగా మూడు సినిమాలు చేస్తున్నాడు Sharwanand. అందులో తెలుగు , తమిళ్ బైలింగ్వెల్ సినిమా ఒకటి. శ్రీ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్తయింది. తాజాగా హీరో శర్వానంద్ , వెన్నెల కిషోర్, ప్రియదర్శి మిగతా నటులపై సన్నివేశాలు తీసారు. ఆ సన్నివేశాలతో టోటల్ షూటింగ్ కి ప్యాకప్ చేప్పేసారు యూనిట్.

Dream Warrior Pictures బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాలో శర్వానంద్ సరసన Ritu Varma హీరోయిన్ గా నటిస్తుంది. ప్రముఖ దర్శకుడు Tharun Bhaskar ఈ సినిమాకి డైలాగ్స్ అందిస్తుండటం విశేషం. Jakes Bejoy మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ ఆల్బం నుండి త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదే స్పీడుతో  త్వరలోనే  ‘శ్రీకారం’ సినిమాను కూడా పూర్తి చేసి కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేయబోతున్న ‘Aadallu Meeku Joharlu’ సినిమాను సెట్స్ పై పెట్టె ఆలోచనలో ఉన్నాడు శర్వా.

Also Check : ఆడాళ్ళు మీకు జోహార్లు అంటున్న శర్వానంద్

UV లో శర్వానంద్ కొత్త సినిమా