దండుపాళ్యం దర్శకుడితో శర్వానంద్?

Monday,January 01,2018 - 10:01 by Z_CLU

‘శతమానంభవతి’, ‘మహానుభావుడు’ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న శరవానంద్ ప్రస్తుతం హను రాఘవపూడి తో ఓ సినిమా సుధీర్ వర్మ తో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ రెండు సినిమాలను ఒకే సారి సెట్స్ పై పెట్టబోతున్న శర్వా లేటెస్ట్ గా దండుపాళ్యం డైరెక్టర్ శ్రీనివాస్ రాజు తో కూడా ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట.

దండుపాళ్యం అనే కన్నడ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొని హిట్ కొట్టిన శీనివాస్ రాజు ఇటీవలే శర్వా కి ఓ స్క్రిప్ట్ వినిపించాడని.. ఇప్పటి వరకూ చేయని ఓ డిఫరెంట్ క్యారెక్టర్ కావడంతో శర్వా ఈ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలుస్తుంది. ప్రస్తుతం వార్త గానే ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.