టాలీవుడ్ లో కొత్త గ్యాంగ్ స్టర్స్

Saturday,May 04,2019 - 11:03 by Z_CLU

ఒక్క ఇమేజ్ కి స్టిక్ అవ్వడం ఆల్మోస్ట్ యాంగ్ హీరోల్లో ఎవరూ ఇష్టపడటం లేదు. కొంచెం కొత్తగా కనిపించే అవకాశం వస్తే సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ లాంటివేవీ మైండ్ లో పెట్టుకోకుండా కథ జెన్యూన్ అనిపిస్తే చాలు సెట్స్ పైకి వచ్చేస్తున్నారు. ఈ ప్రాసెస్ లో కొత్త కొత్త గెటప్స్ లో ఎంటర్టైన్ చేస్తున్నారు హీరోలు. అలా టాలీవుడ్ లో ఏకంగా ఇద్దరు గ్యాంగ్ స్టర్స్ పుట్టుకొచ్చారు శర్వానంద్… వరుణ్ తేజ్.

ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు కానీ 1980 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది శర్వానంద్ సినిమా. సుధీర్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్ గ్యాంగ్ స్టర్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇలాంటి రోల్ ప్లే చేయడం శర్వా కరియర్ లోనే ఫస్ట్ టైమ్.

రీసెంట్ గా హరీష్ శంకర్ డైరెక్షన్ లో సెట్స్ పైకి వచ్చిన ‘వాల్మీకి’ సినిమా కూడా అంతే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ప్లే చేసేది గ్యాంగ్ స్టర్ రోలే. వరుణ్ తేజ్ సినిమా సినిమాకి డిఫెరెన్స్ మెయిన్ టైన్ చేస్తాడనేది తెలిసిందే కానీ, ఇంత తొందరగా ఈ స్థాయి వేరియేషన్ ఉన్న రోల్ ఎంచుకుంటాడని ఫ్యాన్ అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేదు.

రెగ్యులర్ మాస్ సినిమాలు చేయడం వేరు గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో చేయడం వేరు. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో సినిమా అంటే  జస్ట్ యాక్షన్ ఎలిమెంట్స్ ఒక్కటే కాకుండా బోలెడన్నీ ఎంగేజింగ్ ఎలిమెంట్స్ ఉంటే కానీ ఆడియెన్స్ ని కన్విన్స్ అవ్వరు. అలాంటిది కథల్ని చూసి చూసి ఎంచుకునే వరుణ్ తేజ్, శర్వానంద్ ఏకంగా గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలని ఎంచుకున్నారంటే కొత్త ట్రెండ్ క్రియేట్ చేసే సూచనలే కనిపిస్తున్నాయి.