మరోసారి పోలీస్ పాత్రలో...

Saturday,July 04,2020 - 01:37 by Z_CLU

 

ప్రస్తుతం శర్వానంద్ ‘శ్రీకారం’ సినిమాతో పాటు తెలుగు, తమిళ్ లో ఓ బైలింగ్వెల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవి కాకుండా త్వరలో అజయ్ భూపతి డైరెక్షన్ లో ‘మహాసముద్రం’ సినిమా చేయబోతున్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెడీ టు షూట్ మోడ్ లో ఉంది. అయితే దీనితో పాటే తాజాగా మరో సినిమాను ఫైనల్ చేశాడు శర్వా.

ఇటివలే శ్రీరామ్ అనే డెబ్యూ డైరెక్టర్ చెప్పిన కథకు శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో శర్వా ఓ పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు.

ఇంతకుముందు పోలీస్ పాత్రతో రాథ అనే సినిమా చేశాడు శర్వా. అందులో ఆయన క్యారెక్టర్ కాస్త ఫన్నీగా ఉంటుంది. కానీ ఇప్పుడు చేయబోయే క్యారెక్టర్ మాత్రం చాలా సీరియస్ గా, యాంగ్రీ యంగ్ కాప్ లుక్ లో ఉంటుందట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ‘మహాసముద్రం’ షూట్ అవ్వగానే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు శర్వా.