శర్వా కి సర్జరీ పూర్తి

Monday,June 17,2019 - 05:15 by Z_CLU

ఇటీవల గాయపడ్డ యువ హీరో శర్వానంద్ కి సర్జరీ పూర్తయింది. షోల్డర్ భాగంలో బాగా గాయమవడంతో శర్వాకి సర్జరీ తప్పలేదు. హైదరాబాద్లో డాక్టర్ గురవారెడ్డి శర్వాకి సర్జరీ చేసారు. దాదాపు 2 నెలలు విశ్రాంతి అవసరం అంటున్నారు.

’96’ సినిమా రీమేక్ కోసం థాయిలాండ్ వెళ్లి పారా గ్లైడింగ్ ప్రాక్టీస్ చేసే సమయంలో శర్వా గాయపడ్డాడు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గాలి ఎక్కువగా రావడం వల్ల ల్యాండింగ్ సమయంలో ఇబ్బందులు తలెత్తి, ఈ యాక్సిడెంట్ జరిగినట్టు చెబుతున్నారు.

శర్వానంద్ తీవ్రంగా గాయపడ్డంతో, అతడు హీరోగా తెరకెక్కుతున్న ’96’ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అలాగే రిలీజ్ రెడీ అయిన ‘రణరంగం’ ప్రమోషన్స్ పై కూడా ఈ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. దీంతో పాటు మరో సినిమాకు కూడా అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అది కూడా డిలే అవుతుంది.