పవర్ ఫుల్ టైటిల్ కోసం వెయిటింగ్

Tuesday,December 11,2018 - 12:41 by Z_CLU

ఏ సినిమాకైనా టైటిల్ అనేది చాలా కీలకం.. సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళేది టైటిలే… టైటిల్ ని బట్టే సినిమాపై అంచనాలు నెలకొంటాయి. అందుకే టైటిల్ ఫిక్స్ చేసుకునే సమయంలో మేకర్స్ కాస్త జాగ్రత్త వహిస్తుంటారు. చాలా మంది దర్శకులు పవర్ ఫుల్ టైటిల్ దొరికేవరకూ టైటిల్ ని అనౌన్స్ చేయకుండా షూటింగ్ మొదలెట్టేస్తారు.

ఇప్పుడు శర్వానంద్ అండ్ టీం కూడా ఓ పవర్ ఫుల్ టైటిల్ కోసం వెయిట్ చేస్తున్నారని తెలుస్తుంది. సుదీర్ వర్మ డైరెక్షన్ లో శర్వానంద్ హీరోగా నటిస్తున్న పిరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాకు ఇంకా టైటిల్ దొరకలేదని సమాచారం. ఈ సినిమాలో శర్వా పవర్ ఫుల్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేసేలా ఓ పవర్ ఫుల్ టైటిల్ కోసం సెర్చ్ చేస్తుంది యూనిట్.

ఇటివలే ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసిన మేకర్స్ ఇంత వరకూ టైటిల్ దొరకపోవడంతో అది కూడా పోస్ట్ పోన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి శర్వా -సుదీర్ వర్మ ఎలాంటి టైటిల్ తో వస్తారో..చూడాలి.