Mahasamudram - మల్టీస్టారర్ షూటింగ్ పూర్తి

Friday,July 09,2021 - 11:39 by Z_CLU

శ‌ర్వానంద్‌, సిద్ధార్ద్, అజ‌య్ భూప‌తి, ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ `మ‌హా స‌ముద్రం` షూటింగ్ పూర్తి.

ప్రామిసింగ్ యాక్ట‌ర్స్ శ‌ర్వానంద్‌, సిద్ధార్ధ్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి, ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంట‌ర్‌టైన్ మెంట్స్ క‌లిసి `మ‌హాస‌ముద్రం` తీస్తున్నారు. కేవ‌లం ఈ క్రేజీ కాంబినేష‌న్‌ని క్యాష్ చేసుకోవ‌డ‌మే కాదు ఒక ప‌ర్‌ఫెక్ట్ కమర్షియల్ చిత్రానికి అవసరమైన  అన్ని అంశాల‌తో రెగ్యుల‌ర్ మాస్ ఎంట‌ర్ చిత్రాల‌కు భిన్నంగా ఒక డిఫ‌రెంట్ కంటెంట్‌తో ఈ మూవీ వస్తోంది.

ఇది క‌థా ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తికి  డ్రీమ్ ప్రాజెక్ట్. ప్ర‌తి క్యారెక్ట‌ర్‌కు ఎంతో ప్రామ‌ఖ్య‌త ఉండ‌బోతుంది. దానిలో భాగంగానే ఇప్ప‌టికే విడుద‌ల‌చేసిన శ‌ర్వానంద్‌, సిద్దార్ధ్‌, అధితిరావు హైద‌రి, అనూ ఇమాన్యూయేల్, జ‌గ‌ప‌తిబాబు, రావు ర‌మేష్, గ‌రుడ రామ్‌ ఫ‌స్ట్‌లుక్స్‌కి  అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.
maha samudram
గత కొన్ని రోజులుగా ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను తెర‌కెక్కించారు మేక‌ర్స్ దీంతో `మ‌హా స‌ముద్రం`మూవీ షూటింగ్ పూర్త‌య్యింది.

షూట్ ఎంత ఆనందంగా గ‌డిచిందో అనే దానికి ప్రతీకగా విశాఖపట్నం నేపథ్యంలో శర్వానంద్ మరియు సిద్ధార్థ్ న‌వ్వుతూ ఉన్న పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. ఇద్ద‌రు పిడికిలి బిగించి న‌వ్వుతూ ఉన్నఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది.

అదితిరావు హైద‌రి, అనూ ఇమాన్యూల్ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో న‌టిస్తున్నారు. చేత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌తోట సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కేఎల్ ప్ర‌వీణ్ ఎడిట‌ర్‌, కొల్ల అవినాష్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics