జనవరి నుంచి శర్వానంద్, హను సినిమా

Sunday,December 24,2017 - 12:50 by Z_CLU

శర్వానంద్ – హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే…ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా వచ్చే నెల నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. జనవరి రెండో వారంలో ఈ సినిమా షూటింగ్ కోల్ కొత్తా లో స్టార్ట్ కానుందని సమాచారం.

లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ కోల్ కొత్తా లో ఓ నెల పాటు జరగనుందట. ప్రస్తుతం యూనిట్ కోల్ కొత్తా లో లొకేషన్స్ సెర్చ్ చేసే పనిలో ఉన్నారట. మరో వైపు హీరోయిన్ తో పాటు మిగతా ఆర్టిస్టులను కూడా ఫైనల్ చేసే ప్రాసెస్ జరుగుతుందట. ఈ షెడ్యూల్ తర్వాత నేపాల్ లో మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.