ప్రభాస్ టైటిల్ తో శర్వానంద్ సినిమా

Tuesday,January 07,2020 - 11:57 by Z_CLU

మొన్నటివరకు ప్రభాస్ సినిమాకు ఆ టైటిల్ అనుకున్నారు. కట్ చేస్తే శర్వానంద్ అదే టైటిల్ తో పోస్టర్ రిలీజ్ చేశాడు. అదే జాను. అవును.. దిల్ రాజు బ్యానర్ లో శర్వానంద్ చేస్తున్న సినిమాకు జాను అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈరోజు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

తమిల్ లో కల్ట్ లవ్ స్టోరీగా ఇమేజ్ తెచ్చుకున్న 96 అనే సినిమాకు రీమేకే ఈ జాను. 96ను డైరక్ట్ చేసిన ప్రేమ్ కుమార్, ఈ తెలుగు వెర్షన్ ను కూడా డైరక్ట్ చేస్తున్నాడు. తమిళ్ లో విజయ్ సేతుపతి పోషించిన పాత్రను తెలుగులో శర్వానంద్ పోషిస్తున్నాడు. ఇక త్రిష పాత్రలో సమంత కనిపించనుంది.

యాజ్ ఇటీజ్ రీమేక్ చేయకుండా.. తెలుగు ఆడియన్స్ టేస్ట్, నేటివిటీకి తగ్గట్టు కథలో కొన్ని మార్పులు చేశారు. మరీ ముఖ్యంగా దిల్ రాజు కూడా తన ఇన్-పుట్స్ ఇచ్చాడు. అలా సరికొత్తగా ముస్తాబై ప్రేక్షకుల ముందుకొస్తోంది జాను. త్వరలోనే ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్, మూవీ రిలీజ్ డేట్స్ ను ఎనౌన్స్ చేస్తారు.