శర్వానంద్, సాయిపల్లవి సినిమా ప్రారంభం

Saturday,February 03,2018 - 03:36 by Z_CLU

హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ ఓ కొత్త సినిమా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇవాళ్టి నుంచి మొదలైంది. కోల్ కతాలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ మొదలైంది. ఈ షెడ్యూల్ తర్వాత నేపాల్ లో మరో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు.

డిఫరెంట్ కథలు ఎంచుకునే హను రాఘవపూడి, శర్వానంద్ సినిమా కోసం కూడా తనదైన స్టయిల్ లో ఓ కొత్త కథ రాసుకున్నాడు. ఇందులో హీరోయిన్ పాత్రకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. అందుకే ఇందులో నటించేందుకు సాయిపల్లవి ఒప్పుకుంది.

శ్రీ లక్ష్మీవెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ప్రసాద్ చుక్కలపల్లి, సుధాకర్ చెరుకూరి కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేస్తారు.