సెట్స్ పైకొచ్చిన శర్వానంద్
Thursday,October 01,2020 - 07:21 by Z_CLU
హీరో శర్వానంద్ లాక్డౌన్ తర్వాత తన సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేశాడు. నూతన దర్శకుడు శ్రీకార్తీక్ డైరెక్ట్ చేస్తోన్న ఈ బై-లింగ్విల్ సినిమా సెట్స్ పైకి వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి ఇదే ఆఖరి షెడ్యూల్.
తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ ద్విభాషా చిత్రం షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. “లాక్డౌన్ తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రావడం, తాజా గాలిని పీలుస్తున్నంత హాయిగా ఉంది” అంటున్నాడు శర్వానంద్.
రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో అమల అక్కినేని, ప్రియదర్శి, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై 2019లో ఖైదీ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీని అందించిన ఎస్.ఆర్. ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తారాగణం:
శర్వానంద్, రీతూ వర్మ, అమల అక్కినేని, ప్రియదర్శి, వెన్నెల కిశోర్
సాంకేతిక బృందం:
నిర్మాతలు: ఎస్.ఆర్. ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్. ప్రభు
దర్శకత్వం: శ్రీకార్తీక్
బ్యానర్: డ్రీమ్ వారియర్ పిక్చర్స్