స్పేస్ క్రియేట్ చేసుకుంటున్న ‘రాధ’ సింగిల్

Thursday,March 09,2017 - 07:19 by Z_CLU

శర్వానంద్ హీరోగా షూటింగ్ ప్రాసెస్ లో ఉన్న రాధ సింగిల్ రిలీజయింది. చంద్ర మోహన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి రాదన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. శతమానం భవతి లాంటి డీసెంట్ బ్లాక్ బస్టర్ తరవాత బోలెడన్నీఫన్ లోడెడ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ‘రాధ’ సినిమాలో శర్వానంద్ సరికొత్తగా కనిపిస్తున్నాడు. దానికి తోడు ఈ రోజు రిలీజైన సింగిల్ ‘ ఖాకీ చొక్కా’ అప్పుడే సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ లా నిలుస్తుంది.

 

భోగవల్లి బాపినీడు నిర్మిస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ మరీ సీరియస్ పోలీసాఫీసర్ లా కాకుండా, యూనిఫాం అంటే తెగ ఇష్టపడే యంగ్ పోలీస్ లా కనిపిస్తున్నాడు. ఈ రోజు రిలీజైన సింగిల్ ని బట్టి, రాధ సినిమా మొత్తం హిల్లేరియస్ ఎంటర్ టైనర్ గ్యారంటీ అనిపిస్తుంది. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది.