శర్వానంద్ పడిపడి లేచే మనసు – లేటెస్ట్ అప్డేట్స్

Thursday,May 10,2018 - 01:14 by Z_CLU

హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతుంది శర్వానంద్ ‘పడి పడి లేచే మనసు’. ఇమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా రీసెంట్ గా కలకత్తా షెడ్యూల్ కి ప్యాకప్ చెప్పేసింది. ఈ షెడ్యూల్ తరవాత రేపటి నుండి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ బిగిన్ చేయనున్న ఫిల్మ్ మేకర్స్, ఈ షెడ్యూల్ లో శర్వానంద్, సాయి పల్లవి కాంబినేషన్ లో ఇంట్రెస్టింగ్ సీన్స్ తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు.

ఈ సినిమాలో సాయి పల్లవి బెంగాలీ అమ్మాయిలా కనిపించనుంది. ఇక సినిమాలో శర్వా క్యారెక్టరైజేషన్ పెద్దగా రివీల్ కాకపోయినా, హను రాఘవపూడి మార్క్ సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ పై యూత్ లో భారీ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కలపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్న ఫిల్మ్ మేకర్స్ త్వరలో ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు.