నితిన్, శర్వానంద్ లతో దిల్ రాజు మల్టీస్టారర్

Sunday,December 17,2017 - 06:06 by Z_CLU

ప్రస్తుతం వరుస సూపర్ హిట్స్ తో దూసుకెళ్తున్న దిల్ రాజు త్వరలో ఓ మల్టీస్టారర్ సినిమాతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే మహేష్- వెంకటేష్ లతో సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు’,’రామ్ చరణ్- బన్నీ లతో ‘ఎవడు’ వంటి మల్టీస్టారర్ సినిమాలను నిర్మించిన దిల్ రాజు ఇప్పుడు శర్వానంద్-నితిన్ లతో ఓ మల్టీస్టార్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

హరీష్ శంకర్ డైరెక్షన్ లో ‘దాగుడు మూతలు’ అనే సినిమాను నిర్మించబోతున్న దిల్ రాజు ఈ సినిమాలో శర్వానంద్ – నితిన్ నటించనున్నారని ప్రకటించాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టేజి లో ఉన్న ఈ సినిమా సమ్మర్ లో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. సో టాలీవుడ్ లో మరో మల్టీస్టార్ సినిమా రెడీ అవుతుందన్నమాట.