సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్

Thursday,August 31,2017 - 10:06 by Z_CLU

ప్రెజెంట్ వరుస సూపర్ హిట్స్ తో దూసుకెళ్తున్న యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘మహానుభావుడు’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అతి శుభ్రం అనే డిసీస్ ఉన్న యువకుడి కథతో ఎంటర్టైనింగ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజీ కి తీసుకొచ్చిన శర్వా.. త్వరలోనే సుధీర్ వర్మతో చేయబోయే నెక్స్ట్ సినిమాను సెట్స్ పైకి తీసుకురావడానికి రెడీ అవుతున్నాడు.

లేటెస్ట్ గా ‘కేశవ’తో సూపర్ హిట్ అందుకున్న సుధీర్ వర్మ- శర్వా కాంబినేషన్లో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది..