శర్వా ప్లానింగ్ అదే ?

Sunday,November 05,2017 - 11:17 by Z_CLU

ప్రెజెంట్ శర్వానంద్ ఇద్దరు డైరెక్టర్స్ ను ఫిక్స్ చేసుకొని వరుసగా రెండు సినిమాలు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే…. ఇటీవలే సుధీర్ వర్మ డైరెక్షన్ లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ యంగ్ మరో వైపు హీరో రాఘవేందర్రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి కి సినిమాను కూడా ఫైనల్ చేసుకున్నాడు.. అయితే ఈ ఇద్దరిలో ఎవరితో ముందు సెట్స్ పై వెళ్ళబోతున్నాడనే విషయం పై క్లారిటీ త్వరలోనే క్లారిటీ ఇవ్వబోతున్నాడట శర్వా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న రెండు సినిమాలలో ముందుగా సుధీర్ వర్మ సినిమాతో సెట్స్ పైకి వెళ్ళబోతున్నాడట.

సుధీర్ వర్మ తో చేయబోయే సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ అవ్వడంతో ముందుగా ఈ సినిమానే సెట్స్ పైకి తీసుకొచ్చే పనిలో ఉన్నాడట శర్వా.. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళగానే వెంటనే ప్రకాష్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాను కూడా స్టార్ట్ చేసి… సేమ్ టైంలో రెండు సినిమాలను ఫినిష్ చేసి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో థియేటర్స్ లో సందడి చేయాలనీ భావిస్తున్నాడట. ఈ రెండు సినిమాలు సెట్స్ పై పెట్టాకే నెక్స్ట్ సినిమాలను ఫైనల్ చేస్తాడని తెలుస్తుంది.