Sharwanand Next Movie - మరో క్రేజీ ప్రాజెక్ట్

Saturday,September 25,2021 - 10:25 by Z_CLU

వరుస ప్రాజెక్ట్స్ తో ఏడాదికి మూడు సినిమాలతో దూసుకెళ్తున్న యంగ్ హీరోల్లో శర్వానంద్ ఒకడు. ప్రస్తుతం శర్వానంద్ నటించిన రెండు సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. అందులో ‘మహా సముద్రం’ ఒకటి కాగా మరొకటి ‘ఒకే ఒక జీవితం’. ‘మహా సముద్రం’ అక్టోబర్ లో రిలీజ్ కానుంది. ఒకే ఒక జీవితం నవంబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.

ఇక కిషోర్ తిరుమల దర్శకత్వంలో రష్మిక తో కలిసి శర్వానంద్ నటిస్తున్న ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ అనే సినిమా షూటింగ్ స్టేజిలో ఉంది. ఆ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడు శర్వా. అవును శర్వానంద్ నెక్స్ట్ సినిమా అక్టోబర్ లో దసరా రోజు ప్రారంభం కానుందని తెలుస్తుంది. ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ రాజు సుందరం దర్శకుడిగా మారనున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.

Raju Sundaram with sharwanand

అక్టోబర్ ఎండింగ్ లేదా నవంబర్ మొదటి వారంలో సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. వచ్చే ఏడాది ఆరంభంలో ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆ తర్వాత అంటే సమ్మర్ లో రాజు సుందరం మాస్టర్ సినిమాతో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వాలనే ప్లానింగ్ లో ఉన్నాడు శర్వా. ఈ రెండు సినిమాలు అయ్యే లోపు మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టే ఆలోచనలో ఉన్నాడు. వాటి వివరాలు కూడా త్వరలోనే బయటికి రానున్నాయి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics