క్యాన్సిల్ అయిన శర్వానంద్ కొత్త సినిమా

Tuesday,January 30,2018 - 12:48 by Z_CLU

రీసెంట్ గా మహానుభావుడు సినిమాతో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ 2018 ని డిఫెరెంట్ గా ప్లాన్ చేసుకుంటున్నాడు. తన ఫ్యూచర్ సినిమాలను మరింత జాగ్రత్తగా ఎంచుకుంటున్న శర్వా, డైరెక్టర్స్ ని ఫిక్స్ చేసుకునే విషయంలో అంతే జాగ్రత్త పడుతున్నాడు.

ప్రస్తుతం సుధీర్ వర్మ తో పాటు హను రాఘవపూడి లతో అఫీషియల్ గా సినిమాలను అనౌన్స్ చేసిన శర్వానంద్ రీసెంట్ గా దండుపాళ్యం డైరెక్టర్ శ్రీనివాస రాజుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఇన్ సైడ్ సోర్సెస్ ప్రకారం, శ్రీనివాస రాజు సినిమా ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎగ్జాక్ట్ రీజన్స్ తెలీదు కానీ ప్రస్తుతం శర్వా తన ఫుల్ ఫోకస్ ఫిబ్రవరి 1 నుండి సెట్స్ పైకి రానున్న హను రాఘవపూడి సినిమాపైనే ఉంది.

 

కోల్ కతా లో ఫస్ట్ బిగిన్ షెడ్యూల్ బిగిన్ చేయనున్న హను రాఘవపూడి సినిమా యూనిట్, ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ కి ప్యాకప్ చెప్పినట్టు తెలుస్తుంది. మరో వైపు సుదీర్ వర్మ సినిమాను కూడా వీలైనంత త్వరలో సెట్స్ పైకి తీసుకు వచ్చే ఆలోచనలో ఉన్నాడు శర్వానంద్.