నితిన్ దర్శకుడితో శర్వానంద్ సినిమా

Friday,November 17,2017 - 05:51 by Z_CLU

నితిన్  కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కింది లై. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకుడు. హై-టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కిన ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు మరో సినిమా ఎనౌన్స్ చేయలేదు డైరక్టర్ హను. ఇన్నాళ్లకు ఆ రోజు రానే వచ్చింది. శర్వానంద్ హీరోగా హను దర్శకత్వంలో సినిమా రాబోతోంది.

ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేసేందుకు రెడీ అవుతున్నాడు శర్వానంద్.  సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై త్వరలోనే సెట్స్ పైకి రానుంది  ఈ మూవీ. ఈ సినిమా ఓ కొలిక్కి వచ్చిన వెంటనే హనుతో కలిసి సెట్స్ పైకి వెళ్తాడు శర్వానంద్. మూవీ స్టోరీలైన్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

నిజానికి నానితో ఓ సినిమా ప్లాన్ చేశాడు హను రాఘవపూడి. ఆ విషయాన్ని నాని కూడా కన్ ఫర్మ్ చేశాడు. మిలట్రీ బ్యాక్ డ్రాప్ లో మూవీ ఉంటుందని ప్రకటించాడు. కాకపోతే ప్రస్తుతానికి నాని ఖాళీగా లేడు. దాదాపు ఏడాది పాటు కాల్షీట్లన్నీ ఫుల్ అయిపోయాడు. దీంతో శర్వాతో సినిమాకు రెడీ అయ్యాడు హను.