గ్రాండ్ గా లాంచ్ అయిన శర్వానంద్ సినిమా

Thursday,November 23,2017 - 01:02 by Z_CLU

హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కనున్న శర్వానంద్  సినిమా ఈ రోజే గ్రాండ్ గా లాంచ్ అయింది. పూజా కార్యక్రమాల తరవాత  బిగిన్  అయిన  ఈ  కార్యక్రమంలో,  గొట్టిపాటి రవి స్క్రిప్ట్ అందించగా, రాజు సుందరం మాస్టర్ కెమెరా స్విచ్చాన్ చేశాడు. సుకుమార్ గౌరవ దర్శకత్వం వహించిన ఫస్ట్ షాట్ కి దిల్ రాజు క్లాప్ కొట్టాడు.

 

జనవరి 20 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా ప్రస్తుతం హీరోయిన్ తో పాటు, సినిమాలో కీ రోల్ ప్లే చేయనున్న నటీనటుల దగ్గరి నుండి, టెక్నీషియన్స్ ఫిక్స్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది. హను స్టైల్ లో కంప్లీట్ లవ్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కనున్న ఈ సినిమాని సుధాకర్ చిగురుపాటి, ప్రసాద్ చుక్కలపల్లి సంయుక్తంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.