శర్వానంద్ మార్కెట్ పెంచిన శతమానంభవతి

Sunday,January 15,2017 - 11:25 by Z_CLU

సంక్రాంతి కానుకగా విడుదలైన శతమానంభవతి సినిమాకు అన్ని ఏరియాస్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ పొంగల్ కు కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రంగా శతమానంభవతి పేరుతెచ్చుకుంది. యూత్, ఫ్యామిలీ అనే తేడాలేకుండా అంతా ఈ సినిమా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమా స్టోరీలైన్ తమకు కనెక్ట్ అవ్వడంతో… విదేశాల్లోని తెలుగు ఆడియన్స్ అంతా ఈ సినిమా చూసేందుకు స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతేకాదు.. ఈ సినిమాతో హీరో శర్వానంద్ ఓవర్సీస్ లో తన మార్కెట్ కూడా పెంచుకున్నాడు.

shatamanam-1

వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ఈ హీరో శతమానంభవతి సినిమాతో ఓవర్సీస్ లో తనకంటూ ఓ మాార్కెట్ క్రియేట్ చేసుకోగలిగాడు. ఈ సినిమా చేయడాన్ని తన అదృష్టంగా చెప్పుకొచ్చిన శర్వానంద్.. ఓవర్సీస్ లో ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి ఫుల్ ఖుషీగా ఉన్నాడు. శర్వ కెరీర్ లోనే ఓవర్సీస్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవబోతోంది శతమానంభవతి సినిమా.