శర్వానంద్ హిల్లేరియస్ స్టెప్స్

Saturday,December 10,2016 - 01:30 by Z_CLU

బాబు బంగారం లాంటి బంపర్ హిట్ తరవాత మారుతి మెగా కాంపౌండ్ లో గ్రాండ్ ఎంట్రీ గ్యారంటీ అనుకున్నారు. అంతలో మెగా హీరోలు చేతినిండా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండేసరికి ఈ లోపు ఇంకో సినిమా వర్కవుట్ చేసుకుందామనుకున్న మారుతి, శర్వానంద్ తో ఫిక్సయ్యాడనే టాక్ టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్.

సంక్రాంతికి బడా బడా సినిమాలతో పాటే బరిలోకి దిగుతున్న శర్వానంద్ కాంపిటీషన్  ఎంత ఉన్నా, సక్సెస్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సినిమా సినిమాకి కనీసం కంపేర్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా డిఫెరెంట్ కాన్సెప్ట్స్ ని పిక్ చేసుకునే శర్వానంద్ మారుతి సినిమాకి సంతకం చేసింది కన్ఫం అయితే, హిల్లేరియస్ ఎంటర్ టైనర్ గ్యారంటీ అన్నట్టే ఇందులో డవ్ట్ లేదు.