శర్వానంద్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Thursday,January 12,2017 - 05:19 by Z_CLU

గతేడాది సంక్రాంతి కి ‘ఎక్స్ ప్రెస్ రాజా’ సినిమాతో ఎక్స్ ప్రెస్ లా దూసుకొచ్చి బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకున్న శర్వానంద్ ఈ ఇయర్  ‘శతమానం భవతి’ సినిమాతో సంక్రాంతి కి థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమా జనవరి 14 న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న సందర్భంగా శర్వా మీడియా తో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే….

 

*సంక్రాంతి కి పర్ఫెక్ట్ సినిమా

‘శతమానం భవతి’ జనవరి 14 న రిలీజ్ కావడానికి సంక్రాంతి సెంటిమెంట్ కారణమా ? అని చాలా మంది అడుగుతున్నారు. కానీ అలాంటి సెంటిమెంట్ ఏం లేదు ఈ సినిమా సంక్రాంతి పర్ఫెక్ట్. రాజు అన్న కథ చెప్పినప్పుడే సంక్రాంతి రిలీజ్ అని చెప్పారు. కథ విన్నాక నాకు కూడా అదే అనిపించింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాతో అనుకోకుండా సంక్రాంతి కి రావడం జరిగింది.

 

*చేయడం ఇష్టం లేదు…

ముందు ఈ సినిమా చేయమని అడిగినప్పుడు నాకు ఇంటరెస్ట్ లేదు. ఆ టైం లో దిల్ రాజు అన్న ఈ కథ విన్నాక డిసైడ్ అవ్వమని చెప్పారు. కథ విన్నాక ఎలాంటి ఫామిలీ ఎంటర్టైనర్ లో భాగం అవ్వాలని అనిపించింది. సతీష్ గారు కథ చెప్పగానే ఓకే అనేసా.

 

*పండగ లాంటి సినిమా

దూరమౌతున్న సంబంధాలను దగ్గర చేసే పండగ లాంటి సినిమా ఇది. అందుకే ఈ సంక్రాంతి కి విడుదల అవుతుంది. ఈ సినిమా ఖచ్చితంగా సంక్రాంతి పండగ కి మరింత కల తీసుకొస్తుందని ఆశిస్తున్నా

 

*అవన్నీ గుర్తొచ్చాయి

పల్లెటూరి లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు చాలా సార్లు నేను మా ఊరు వెళ్లి సరదాగా గడిపిన ఆ రోజులన్నీ గుర్తొచ్చాయి. నాకే కాదు అందరికీ గుర్తొచ్చే అలాంటి సీన్స్ ఈ సినిమాలో ఎన్నో ఉన్నాయి.

 

* కొత్తగా ట్రై చేశా

ఈ కథ విన్నాక నన్ను నేను మార్చుకోవడానికి పెద్దగా టైం పట్టలేదు. కానీ పల్లెటూరి యాస నేర్చుకోవడానికి కాస్త కష్ట పడ్డాను. ఈ సినిమా విషయంలో అదొక్కటే కొత్తగా ట్రై చేశా..

 

*వాళ్ళతో ఓ కొత్త అనుభూతి

ఈ సినిమాతో చాలా మంది సీనియర్ ఆర్టిస్టులతో వర్క్ చేసే అవకాశం వచ్చింది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ గారితో జయసుధ గారి తో స్క్రీన్ షేర్ చేసుకోవడం కొత్త అనుభూతి కలిగించింది. ఈ సినిమా లో ప్రతీ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అన్ని క్యారెక్టర్స్ ఆకట్టుకుంటుంది.మెయిన్ గా నరేష్ క్యారెక్టర్ చాలా ఎంటర్టైన్ చేస్తుంది.

 

*అనుపమ సినిమాకు ప్లస్ 

అనుపమ క్యారెక్టర్ సినిమాకు ప్లస్ అవుతుంది. పైగా లక్కీ హీరోయిన్ కూడా ఆదృష్టం మా సినిమాకి కూడా కలిసొస్తుందని ఆశిస్తున్నా.

 

*ఖచ్చితంగా ఫోన్ చేస్తారు

ఈ సినిమా చూసిన తర్వాత ఖఛ్చితంగా మీ అమ్మ నాన్నలకు ఫోన్ చేసి మాట్లాడతారు. అలాంటి పవర్ ఫుల్ ఎమోషన్ సీన్స్ ఈ సినిమాలో ఉన్నాయి.

 

*అలాంటి ఫీలింగ్ లేదు 

ఈ కథ నాకంటే ముందు సాయి ధరమ్ తేజ్, రాజ్ తరుణ్ విన్నారు. నేను చేయాలనీ ఉంది కథ నచ్చింది చేసేసా. తేజు కూడా ఈ సినిమా చెయ్ నీకు సూట్ అవుతుందని చెప్పాడు.

 

*మా డైరెక్టర్ ఆ ఫీల్ తెప్పించాడు

ఈ సినిమా కథ కొత్తగా అనిపించక పోవచ్చు కానీ ఓ ఫ్రెష్ సీన్స్ తో ఫ్రెష్ ఫీల్ మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తుంది. సతీష్ గారు ఈ సినిమాను ఆలా తెరకెక్కించారు. పైగా దిల్ రాజు గారి మార్క్ కూడా ఈ సినిమాలో కనిపిస్తుంది.

 

*ఈ ఏడాది మూడు సినిమాలు

ఈ ఇయర్ నావి మూడు సినిమాలు రిలీజ్ అవుతాయి. ప్రస్తుతం బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ గారి ప్రొడక్షన్ లో నటిస్తున్న సినిమా చివరి దశలో ఉంది.

 

* మారుతి గారి తో చేస్తున్నా

ఇటీవలే మారుతి గారు ఓ కథ వినిపించారు. నాకు కూడా బాగా నచ్చింది. ఈ సినిమా కి సంబంధించి డీటైల్స్ త్వరలోనే ప్రకటిస్తాం