శర్వానంద్ గెటప్ లీక్

Thursday,February 21,2019 - 02:10 by Z_CLU

ఫుల్ గా గడ్డం పెంచి, డాన్ గెటప్ లో ఉన్న శర్వానంద్ ఫొటోస్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి. సుదీర్ వర్మ డైరెక్షన్ లో శర్వానంద్ చేస్తున్న కొత్త సినిమా స్టిల్స్ ఇవి. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ సినిమాకు సంబంధించి శర్వానంద్ లుక్ ఇలా లీక్ అయింది.

పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు శర్వా. అందులో డాన్ లుక్ ఒకటి. ఆ లుక్ తోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేశారు మేకర్స్. అయితే అనుకోకుండా ఆ లుక్ ఇలా లీక్ అయిపోయింది.

మరో ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ని ఫిక్స్ చేసే పనిలో మేకర్స్ ఉన్నారు. టైటిల్ ఫిక్స్ అవ్వగానే ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారు. కాజల్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైనర్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.